డిశ్చార్జ్ అయిన వెంట‌నే అరెస్టు!

Update: 2016-04-07 12:15 GMT

బుల్లి తెర న‌టి ప్ర‌త్యూష ఆత్య‌హ‌త్య ర‌క‌ర‌కాల మ‌లుపులు తిరుగుతోంది. ప్ర‌త్యూష ఆత్మ‌హ‌త్య వెనుక ఆమె ప్రియుడు రాహుల్ ఉన్నాడ‌ని ప్ర‌త్యూష కుటుంబ సభ్యులు, స్నేహితులు, స‌న్నిహితులూ ఆరోపిస్తున్నారు. రాహుల్‌కి వ్య‌తిరేకంగా పోలీసులు వాంగ్మూలాలు సేక‌రించే ప‌నిలో పడ్డారు. దాదాపు 20మందిని విచారించిన పోలీసులు.. ఈ ఆత్మ‌హ‌త్య వెనుక రాహుల్ ప్ర‌మేయంపై ఓ నిర్దార‌ణ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. రాహుల్‌తో గొడ‌వ ప‌డి, ఆ కోపంతోనే ప్ర‌త్యూష ఆత్మ‌హ‌త్య చేసుకొంద‌న్న ప్రాధ‌మిక అంచ‌నాకు పోలీసులు కూడా వ‌చ్చేశారు. రాహుల్ వ‌ల్లే ప్ర‌త్యూష అప్పుల పాలైంద‌ని, ఆ ఒత్తిడి కూడా ప్ర‌త్యూష త‌ట్టుకోలేక‌పోయింద‌ని పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు రాహుల్‌ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేశారు. ఛాతినొప్పి అనే కార‌ణం చెప్పి రాహుల్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. రాహుల్ డిశ్చార్జ్ అయిన వెంట‌నే అరెస్టు చేయడానికి పోలీసులు స‌మాయాత్తం అయ్యారు. రాహుల్‌ని అరెస్టు చేసి విచారిస్తే.. మ‌రిన్ని నిజాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Similar News