ట్రంప్ వెనక్కు తగ్గాడా?

Update: 2017-02-21 14:30 GMT

ఏడు ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి నిషేధిస్తూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలను కోర్టులు తప్పుపట్టాయి. దీంతో ట్రంప్ కొత్తగా సవరించిన ఉత్తర్వులను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సవరించిన ఉత్తర్వుల్లోనూ ఈ ఏడు దేశాలనూ వదలలేదట. కాని గ్రీన్ కార్డులున్న వారికి అమెరికాలో ప్రవేశించేందుకు అనుమతిచ్చేలా కొత్త ఉత్తర్వులు ఉండబోతున్నాయని వైట్ హౌస్ అధికారులు చెబుతున్నారు. తుది ముసాయిదాను అతి త్వరలోనే విడుదల చేస్తామంటున్నారు. సవరించిన తుది ముసాయిదా ఉత్తర్వులు ప్రస్తుతం అధికారులకు చేరడంతో వాటిని విడుదల చేసేందుకు వైట్ హౌస్ అధికారులు సిద్ధమవుతున్నారు.

ట్రావెల్ బ్యాన్ తో అమెరికాలో పెద్ద యెత్తున నిరసనలను వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అగ్రరాజ్య అధ్యక్షులు ట్రంప్ వలసలపై కొత్త కార్యనిర్వాహక ఆదేశాలను జారీ చేస్తారనని ప్రతి మీటింగ్ లో చెబుతూ వస్తున్నారు. కొత్త ఆదేశాల్లోనూ ట్రంప్ ఆ ఏడు దేశాలనే టార్గెట్ చేసుకున్నారని, గ్రీన్ కార్డులు ఉన్నవారిని ఇందులో మినహాయింపు ఇస్తున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. మొత్తం మీద ట్రంప్ తీసుకొచ్చే సవరించిన కొత్త ట్రావెల్ బ్యాన్ ఎలా ఉండబోతుందన్న దానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Similar News