టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్య

Update: 2017-01-12 04:45 GMT

సంక్రాంతి పండగ సందర్భంగా జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. పండగ సెలవల కోసం సొంతూర్లకు సొంత వాహనాలతో బయలుదేరడంతో రహదారి మొత్తం కార్లతో కిక్కిరిసిపోయింది. టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. ముఖ్యంగా నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద రెండు కిలోమీటర్ల మేరకు కార్లు ఆగిపోయాయి. టోల్ ఫీజు చెల్లించడానికి కార్లు బారులు తీరాయి. హైదరాబాద్ వచ్చే వైపు టోల్ గేట్ల వరుస తగ్గించినా ఫలితం కన్పించలేదు. హైదరాబాద్ నుంచి వెళ్లే వైపు ఎక్కువ సంఖ్యలో వాహనాలు రావడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తింది.

సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు తప్పనిసరిగా వెళ్లే సంప్రదాయం ఉండటంతో గురువారం ఈ సమస్య ఏర్పడింది. రేపు భోగి పండగ కావడం...తెలంగాణలో 12వ తేదీ నుంచి పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో అందరూ ఈరోజు ఉదయమే సొంత గ్రామాలకు బయలుదేరారు. దీంతో పోలీసులు టోల్ ప్లాజాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కరెన్సీ కొరత కారణంగా ఎక్కువ మంది టోల్ గేట్ల వద్ద కార్డులు ఉపయోగిస్తుండటం వల్ల నిదానంగా వాహనాలు కదులుతున్నాయి. రేపు కూడా ఇదే సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు టోల్ నిర్వాహకులు

Similar News