టెన్షన్ పెడుతున్న ’అమ్మ‘

Update: 2016-10-01 09:21 GMT

తమిళ నాడు ప్రజలు అమ్మ అని పిలుచుకునే పురట్చి తలైవి జయలలిత ఆరోగ్యం విషమంగా మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఆరోగ్యాన్ని గురించి తమిళనాడు వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఒకవైపు ఆస్పత్రి వర్గాలు గుంభనంగా ఉంటూ.. జనంలో టెన్షన్ ను మరింత పెంచుతున్నాయి. ప్రజలు, ప్రత్యేకించి జయలలిత అభిమానుల్లో ఇప్పటికే అదుపు తప్పి పోతున్నారు.

చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద వేల సంఖ్యలో ఇప్పటికే పోలీసులను మోహరించడం.. కనీసం సొంత పార్టీ నాయకులను కూడా జయలలితను చూసేందుకు లోనికి అనుమతించకపోవడం వంటి పరిణామాలు అనేక రకాల చర్చోపచర్చలకు దారితీస్తున్నాయి.

మరొకవైపు ఆమె ఆరోగ్యం గురించి బులెటిన్ విడుదల చేయాలని, వీడియోలు విడుదల చేయాలని, ఫోటోలు చూపించాలని రకరకాల డిమాండ్లతో ప్రతిపక్షాలు కొత్త అనుమానాల్ని పుట్టిస్తున్నాయి. అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నదనే ప్రచారంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఓ ఫ్రెంచి మహిళ కూడా ఉన్నారు.

జయలలితకు చికిత్స అందించేందుకు విదేశాల వైద్యులు కూడా వచ్చారు. ప్రత్యేకంగా లండన్ నుంచి కూడా డాక్టర్లను రప్పించారు. ఇవాళ సాయంత్రం తమిళనాడు ఇన్ ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా ఆమెను పరామర్శించేందుకు చెన్నై వెళ్లనున్నట్లు వార్తలు

 

 

Similar News