టీజేఏసీ బాటలో విపక్షాలు

Update: 2016-12-26 05:29 GMT

తెలంగాణలోని విపక్షాలు టీజేఏసీని అనుకరిస్తున్నాయి. తెలంగాణ రాజకీయ జేఏసీ తీసుకున్నఅజెండాను ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆదివారం టీజేఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సోమవారం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాల రూపంలో ఇచ్చాయి. కాంగ్రెస్ ఉద్యోగాల కల్పనలో విఫలంపై వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇక టీడీపీ జోనల్ వ్యవస్థ రద్దుపై వాయిదా తీర్మానం ఇచ్చింది.

అసెంబ్లీలో కోదండరామ్ డిమాండ్లు....

టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ప్రజాసమస్యలపై ఉద్యమించడానికి కార్యాచరణను రూపొందించుకున్నారు. అందులో ప్రధానంగా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలన్నది ప్రొఫెసర్ ప్రధాన డిమాండ్. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఈ విషయంలో బాధిత పార్టీలే. రెండు పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. దీనిపై కాంగ్రెస్, టీడీపీలు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించాయి. ఫిరాయింపుల నిరోధక చట్టంపై స్పీకర్ హుందగా ప్రవర్తించాలని కోదండరామ్ డిమాండ్ చేయడంతో టీడీపీ, కాంగ్రెస్ లు రెండూ టీజేఏసీ తమకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో టీజేఏసీ చేపట్టే ఉద్యమాలకు మద్దతునిచ్చే ఆలోచన చేస్తున్నాయి విపక్ష పార్టీలు. అందుకోసమే సోమవారం కోదండరామ్ డిమాండ్లను వాయిదా తీర్మాన రూపంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాయంటున్నారు విశ్లేషకులు

Similar News