జనసేనని స్వాగతిస్తున్న కాంగ్రెస్!

Update: 2016-04-15 00:52 GMT

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కాంగ్రెస్ ఫుల్ సపోర్ట్ చెస్తుందట. ఆ మాటను పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం చెబుతున్నారు. హైదరాబాద్ లోని ఇందిర భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన గంగాధరం.. పవన్ కళ్యాణ్ క్రియాశీల రాజకీయాల్లోకి రావడాన్ని కాంగ్రెస్ స్వాగతిస్తున్నదని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రజా సమస్యలపై పోరాటానికి పవన్ సిద్ద పడితే కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని సెలవిచ్చారాయన. ఇది ఉహించని మద్దత్తే. 'కాంగ్రెస్ హటావో దేశ్ బచావో' అనే స్లోగన్ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్.. కాంగ్రెస్ మద్దత్తు తీసుకుంటాడంటారా..

Similar News