జగన్ పై మరీ అంత వివక్షా........?

Update: 2017-02-28 11:30 GMT

ఏపీ అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడిని అవమానించేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మార్చి 6 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 2వ తేదీన ఏపీ అసెంబ్లీ భవనాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడికి ఛాంబర్‌., పేషీ., వైసీపీ శాసన సభా పక్ష కార్యాలయాలను ఏర్పాటు చేయకపోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. అసెంబ్లీలో కేవలం జగన్‌కు మాత్రమే చిన్న గదిని కేటాయించారని ఇది ఖచ్చితంగా దురుద్దేశంతో చేసిందేనని ఆరోపిస్తున్నారు.

అందరికీ కేటాయించి...

తక్షణం అసెంబ్లీలో గదులు కేటాయించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా శాసన సభా కార్యదర్శికి వినతి పత్రం అందచేశారు. సభాపతి., సిఎం., చీఫ్ విప్‌., విప్‌లు., చీఫ్‌ మార్షల్‌కు సైతం అసెంబ్లీలో గదులు కేటాయించారు. మంత్రులు., ప్రభుత్వ పెద్దలు., విప్‌లకు కలిపి 22 గదులు కేటాయించారు. జగన్‌కు., వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షానికి మాత్రం గదులు కేటాయించలేదు. దీనిపై నిరసన తెలపాలని పార్టీ నేతలు నిర్ణయించారు. అసెంబ్లీలో గదులు కేటాయించకపోతే బయట ప్రాంగణంలోనే టెంట్‌ వేసి కార్యాలయం నడుపుకుంటామని హెచ్చరిస్తున్నారు.

Similar News