చెన్నైలో మరో జల్లికట్టు ఉద్యమం?

Update: 2017-02-10 04:30 GMT

తమిళనాడులో మరో జల్లికట్టు తరహా ఉద్యమం జరగబోతోందా? మెరీనా బీచ్ అందుకు వేదికగా మారబోతోందా? పోలీసుల హడావిడి చూస్తే అవుననే అనిపిస్తోంది. పన్నీర్ సెల్వానికి మద్దతుగా జల్లికట్టు తరహాలో ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు పోలీసులకు సమాచారం అందడంతో మెరీనా బీచ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మెరీనా బీచ్ వద్ద భారీ బందోబస్తు...

పన్నీర్ సెల్వానికి సోషల్ మీడియాలో యువత భారీగా తన మద్దతును ప్రకటిస్తుంది. ఎక్కడ చూసినా పన్నీర్ సెల్వానికి మద్దతుగానే పోస్టింగ్ లు కన్పిస్తున్నాయి. అలాగే కొన్ని సామాజిక సంస్థలు నిర్వహించిన ఆన్ లైన్ ఓటింగ్ లో పన్నీర్ కు అనుకూలంగా 80 శాతం మంది ఓటింగ్ వేశారు. దీంతో యువత పన్నీర్ నే సీఎం గా ఎన్నుకోవాలని కోరుకున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పాటు తమిళ సినీ ఇండ్రస్ట్రీ నుంచి కూడా పన్నీర్ కే మద్దతు పెరుగుతుండటంతో మెరీనా బీచ్ వద్ద మరోసారి జల్లికట్టు తరహా ఆందోళన జరుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. అందుకోసం మెరీనాబీచ్ వద్దకు ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పన్నీర్ ను సీఎం చేయాల్సిందేనన్న డిమాండ్ తమిళనాడులో ఊపందుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Similar News