చిన్నమ్మకు మద్దతిస్తే తమిళ ప్రజలు సహించటం లేదు

Update: 2017-02-26 06:41 GMT

తమిళనాట తిరుగులేని డిక్టేటర్ గా తన పాలనను చలామణి చేసుకున్న అమ్మ జయలలిత ఆ రాష్ట్ర ప్రజలలో ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నారు. అమ్మ జయలలిత ఆకస్మిక మరణం అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను అన్న డి.ఎం.కే నేతలు ముఖ్యంగా చినమ్మ శశికళ వర్గీయులు అమ్మ కి చేసిన అవమానంగానే పరిగణిస్తున్న తమిళ ప్రజలు ఇప్పుడు చినమ్మ శశికళ వర్గీయులపై తమ వ్యతిరేకతని బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని తిరువాదాలై శాసన సభ నియోజకవర్గంలో గోడలకు అంటించిన వాల్ పోస్టర్లు, ఆ నియోజకవర్గానికి ప్రతినిధిగా వున్న శాసన సభ్యుడు, నటుడు ఐన కరుణాస్ పై చెప్పులు విసిరిన వైనం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.

అమ్మ జయలలిత మరణాన్తరం అమ్మ వీర విధేయుడిగా గుర్తింపు వున్న పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పీఠాన్ని అధీష్టించగా శశికళ ఆ హోదా దక్కించుకునే క్రమంలో తన వర్గీయులతో పన్నీర్ సెల్వం పై అసంతృప్తి వేటు వేయించే దిశగా అడుగులు వేసినప్పుడు శశికళను తన పూర్తి మద్దతు తెలిపారు కరుణాస్. కాగా తమిళనాడు రాజకీయాలలో చోటుచేసుకున్న అనేక పరిణామాల తరువాత శశికళ జైలు శిక్ష ఖరారై కటకటాల వెనుకకు వెళ్లిపోవటంతో ఆమె మద్దతుదారులకు ఇప్పుడు రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. ఇటీవల తన పుట్టిన రోజు పురస్కరించుకుని తన నియోజిక వర్గంలో పలు కార్యక్రమాలు చేపట్టదలిచిన కరుణాస్ కు ప్రజలు చెప్పులు విసిరి నిరసన తెలపటంతో పాటు తన పుట్టిన రోజు పోస్టర్లపై కరుణాస్ భార్య గ్రెస్ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్న పోస్టర్లను అంటించి కరుణాస్ పైనే కాక చిన్నమ్మపై కూడా తమ వ్యతిరేకతని బహిరంగ పరిచారు.

Similar News