చంద్రబాబూ..కేసీఆర్ ను చూసి నేర్చుకో

Update: 2018-04-06 14:52 GMT

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అనుసరించిన వైఖరి ఏంటో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని జగన్ చంద్రబాబుకు సూచించారు. ఆనాడు తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దాడతానన్న కేసీఆర్ మాటలే అన్ని పార్టీలనూ అక్కడ ఏకం చేసి ఫలితం వచ్చిందన్నారు. కాని ఇక్కడ పార్టీలను చీల్చి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టావని జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ ప్రత్యేక హోదా ఉద్యమం ఈస్థాయికి వచ్చిందంటే అది వైసీపీ వల్ల కాదా? అని ప్రశ్నించారు. ఉద్యమం అంటే కేసీఆర్ లాగా చేయాలని, విపక్షాలను నీరుగారుస్తూ, వారి ఉద్యమాలను అణిచివేస్తూ ప్రత్యేక హోదాను ఎలా సాధిస్తారని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. తాను నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నా తనను హేళన చేసింది నిజం కాదా? అని అన్నారు. చంద్రబాబు వల్లనే ఏపీకి ఇప్పటి వరకూ ప్రత్యేక హోదా రాలేదన్నారు. రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలపై బురద జల్లకుండా మెచ్చుకోమని సూచించారు.

Similar News