చంద్రబాబులో కట్టలు తెంచుకున్న అసహనం

Update: 2016-11-21 03:06 GMT

చంద్రబాబులో కట్టలు తెంచుకున్న అసహనంకేంద్రంతో సామరస్యంగా ఉంటూ రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకోవడం అనే సిద్ధాంతానికి కట్టుబడి చంద్రబాబు నాయుడు ఈ దఫా పరిపాలన సాగిస్తున్నారు. ఆయన సహజశైలికి ఆగ్రహం కలిగించే అనేక సందర్భాలు తారసిల్లినప్పటికీ అయన ఎన్నడూ అదుపు తప్పకుండా, కేంద్రం గురించి మాట జారకుండా వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. అలాంటి చంద్రబాబుకు కూడా జనం పడుతున్న నోటు కష్టాల విషయంలో ప్రభుత్వ అలసత్వం చూసి కోపం వచ్చినట్లుంది.

.సమస్యను పరిష్కరించడానికి మరీ ఇన్ని రోజులు సమయం పడుతుండడం అయన జీర్ణించుకోలేక పోతున్నట్లుంది. ఏపీ లో నోటు కష్టాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. చంద్రబాబు కలెక్టర్లతో ప్రతిరోజూ సమన్వయము చేస్తూ పరిష్కారానికి ప్రయత్నిస్తున్నా ఒక పట్టాన కొలిక్కి రావడం లేదు. అయినా కొత్తనోట్లు తగినంత రాకుండా కష్టాలు తీరే ఛాన్స్ లేదు. ఈ నేపధ్యంలో తను పదివేల కోట్ల నోట్లు కావాలని లేఖ రాస్తే రెండు వేల కోట్లు మాత్రమే వస్తే బహుశా ఎవరికైనా ఇలాగె ఉంటుందేమో.

మోడీ సర్కారు కూడా కష్టానివారణ చర్యలు తీసుకోవడంలో మరింత వేగం ప్రదర్శించాలని జనం కోరుకుంటున్నారు. మరి కేంద్రంలో కదలిక ఎప్పటికి వస్తుందో

Similar News