చంద్రబాబు కుటుంబ ఆస్తులు వెల్లడించిన లోకేష్

Update: 2016-10-19 08:20 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏటా సాంప్రదాయాన్ని పాటిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తుల వివరాలను బుధవారం గుంటూరులో ప్రకటించారు. దేశంలో ఆస్తుల వివరాలు ప్రకటిస్తున్న ఏకైక రాజకీయ కుటుంబం తమదే అని లోకేష్ వెల్లడించారు. విపక్షాలు తమకు బినామీ ఆస్తులను అంటగట్టడానికి ప్రయత్నిస్తుంటాయని , వారికి అవకాశం వస్తే టాటా, బిర్లాలు కూడా నాకు బినామీలే అని చెబుతారని లోకేష్ చెప్పారు. తనకు దేశంలో తప్ప, మరే దేశంలోనూ బ్యాంక్ అకౌంట్లు లేవని కూడా వెల్లడించారు. పదివేల కోట్ల రూపాయల నల్లధనం వెల్లడించిన వ్యక్తులు తన బినామీలు కాదు అనే విషయంకూడా లోకేష్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలతో బురద చల్లడానికి అదే పనిగా ప్రయత్నిస్తున్నాయంటూ విమర్శించారు. అభివృద్ధికి విపక్షాలు అడ్డుపడుతున్నాయని కూడా ఆరోపించారు.

ఆయన ప్రకటించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.

 

చంద్రబాబు అంబాసిడర్ కారు 1.52 లక్షల

చంద్రబాబు పేరిట ఉన్న ఆస్తులు 3.73 కోట్ల రూపాయలు

చంద్రబాబు పేరిట ఉన్న బ్యాంకు రుణాలు 3.06 కోట్ల రూపాయలు

నిర్వాణా హోర్డింగ్స్‌లో 3.28 కోట్ల పెట్టుబడులు

జూబ్లీహిల్స్ లోని నివాసభవనం 3.68 కోట్లు

 

నారా భువనేశ్వరి మొత్తం ఆస్తులు 38.66 కోట్లు

భువనేశ్వరి అప్పులు

పంజాగుట్టలో 73 లక్షల విలువైన ఇల్లు

చెన్నయ్ లో 1.86 కోట్ల విలువైన గోడౌన్

మదీనగూడ 73.8 లక్షల విలువైన భూమి

హెరిటేజ్ ఫుడ్స్ లో 19.95 పెట్టబడులు

బంగారు ఆభరణాలు 1.27 కోట్లు

ఆడి కారు 91 లక్షలు

అప్పులు 13 కోట్లు

నికర ఆస్తులు 24.84 లక్షలు

 

లోకేష్ పేరిట ఉన్న ఆస్తులు

మదీన గూడ లో 2.21 కోట్ల విలువైన ఫాంహౌస్

2.52 పెట్టబడులు

నిర్వాణా హోల్డింగ్స్ లో 1.62

14.50 కోట్లు

అప్పులు 6.35 కోట్లు

నికరం 8.15 కోట్లు

 

బ్రాహ్మణి పేరిట ఉన్న ఆస్తులు

బ్రాహ్మణి పేరిట ఉన్న మొత్తం ఆస్తులు 12.75 కోట్లు

మొత్తం అప్పులు 42 లక్షలు

నికర ఆస్తులు 12.33 కోట్ల రూపాయలు.

Similar News