గంట ముందే కొండపైకి వెళ్ళే అవకాశం....

Update: 2017-04-13 12:36 GMT

వేసవి నేపథ్యంలో తిరుమల కొండపైకి వాహనాలను అనుమతించే సమయాల్లో మార్పులు చేస్తూ టీటీడీ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల-తిరుపతి మధ్య రాకపోకలకు ఉన్న రెండు కనుమ దారుల్లో సాధారణంగా అర్ధరాత్రి 12గంటల వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. తిరిగి తెల్లవారుజాము 3గంటలకు కొండపైకి వెళ్లేందుకు వాహనాలను అనుమతిస్తారు. వేసవి సెలవులు ప్రారంభమవుతుండటంతో కొండపై భక్తుల రద్దీ పెరుగనుంది. దీంతో తెల్లవారుజామున రెండు గంటల నుంచి కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. ఫలితంగా తిరుపతిలో బస చేసి స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. రాత్రి పొద్దుపోయిన తర్వాత తిరుపతిలో బయల్దేరినా అరగంటలో తిరుమల చేరుకునేందుకు వీలవుతుంది. వేకువన జరిగే సుప్రభాత సేవ., ఇతర ఆర్జిత సేవా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనేందుకు వీలు కలుగుతుంది.

Similar News