ఖమ్మంలో టిఆర్‌ఎస్‌ ప్లీనరీకి ఏర్పాట్లు!

Update: 2016-04-04 14:12 GMT

  • ఈ నెల 27న టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం
  • ఖమ్మం పట్టణంలో వేడుకలు జరిపేందుకు నిర్ణయం
  • రాష్ట్రంలోని పదివేల మంది ప్రతినిధులు హజరు
  • తుమ్మల నేతృత్వంలో కొనసాగుతున్న ఏర్పాట్లు
  • గులాబీ పార్టీకి గట్టి పునాదులు వేయడమే లక్ష్యం
  • గులాబీ పార్టీలో పండుగ సందడి మొదలైంది. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు టిఆర్ఎస్ శాసనసభాపక్షం నిర్ణయించింది. ఇందుకోసం ఖమ్మం పట్టణాన్ని ఎంపిక చేశారు సిఎం కెసిఆర్. పార్టీ ఆవిర్బవించిన నాటి నుండి ఆ జిల్లాలో పార్టీకి బలమయిన పునాదులు లేవు. ఇప్పటి వరకు భారీ బహిరంగ సభలు నిర్వహించిన దాఖలాలు లేవు. తుమ్మల నాగేశ్వరావును టిఆర్ ఎస్‌లో చేర్చుకుని మంత్రి పదవి క ట్టబెట్టిన కెసిఆర్ ఆయన నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసే చర్యలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తెలంగాణలో ఏ జిల్లాలో జరగని విదంగా ఒక్క ఖమ్మం జిల్లాకు సంబందించిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాలు పలువురు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఖమ్మం కార్పోరేషన్ పై గులాబీ జెండా ఎగిరింది. ఈ నేపథ్యంలో పార్టీ ప్లీనరీ, బహిరంగ సభను విజయవంతం చేసేందకు టిఆర్ఎస్ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నగర శివార్లలోని చెరుకూరి వారి మామిడితోట లో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిన పార్టీ పెద్దలు దానికి సంబందించిన పనులను ప్రారంభించారు. ప్రస్తుతం రెండు డోజర్లు ఆ ప్రాంతంలో పనిచేస్తున్నాయి.

    Similar News