కొత్త ఏడాది డీజీపీ మనోగతం ఇదే...!

Update: 2017-12-30 14:12 GMT

తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ పెరిగిందని, కానీ శాంతి భద్రతలకు మాత్రం ఎలాంటి విఘాతం కలగలేదని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు....2018 సంవత్సరాన్ని పిపుల్స్ ప్రెండ్లీ పోలీసింగ్ సంవత్సరంగా ప్రకటించారు డిజిపి.అన్నివర్గాల ప్రజలను కలుపుకుని టెక్నాలజీ తో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసామని చెప్పారు. 2017 తెలంగాణ రాష్ట్ర క్రైమ్ రీవ్యూ పై ఓ రిపోర్ట్.

డాక్యుమెంటరీ విడుదల...

2018 సంవత్సరం లో తెలంగాణ పోలీస్ శాఖ చేయబోతున్న కార్యక్రమాల పై ఒక డాక్యుమెంటరీ ని విడుదల చేశారు తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి..తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో కలిసి శాంతి భద్రతల పరిరక్షణ కు కృషి చేస్తామన్నారు..డిజిపి 2018 సంవత్సరాన్ని టెక్నాలజీ, ఫ్రెండ్లీ పోలీసింగ్ గా ప్రకటించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చే విధంగా 2018 ప్రణాళిక సిద్ధం చేసామన్నారు...తెలంగాణ రాష్ట్రం లో నేరం జరిగితే దొరికి పోతామనే భయం వచ్చేలా పోలీస్ వ్యవస్థ ను రూపుదిద్దుతామన్నారు. పోలీస్ శాఖ లో అన్ని పోలీస్ యూనిట్ లో సాంఘిక మాధ్యమాల ద్వారా మానటరింగ్ చేసి పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ యూనిట్ లో ఇన్ ఫోర్స్ మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించి నేరాలను అదుపుచేయడానికి కృషి చేస్తామన్నారు.

సైబర్ నేరాలపై....

ఇటీవల పెరిగిపోతున్న సైబర్ నేరాల పై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో సైబర్ నేరాల పై ప్రత్యేక యూనిట్ లను ఏర్పాటు చేస్తామన్నారు..రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో సీసీటీవీ లతో పాటు రిసెప్షన్ డెస్క్ ల ఏర్పాటు చేసి వారి ఫీడ్ బ్యాక్ రిపోర్టును సైతం పర్యవేక్షిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేటు 12.93 శాతం పెరిగినా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలకు మాత్రం ఎలాంటి విఘాతం కలగులేదన్నారు. ముఖ్యంగా సైబరాబాద్,రాచకొండ,ఖమ్మం కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేట్ పెరిగిందన్నారు.....మేజర్ ఫెస్టివల్స్ లో ఎలాంటి సంఘటనలు జరగకుండా అన్ని పండుగలను విజయవంతం చేసామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోకి నక్సల్స్ రాకుండా అనేక చర్యలు చేపట్టామని అనేక మంది నక్సల్స్ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నామన్నారు.

మహిళల పట్ల నేరాలు పెరిగాయి...

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మహిళ పట్ల నేరాలు 18.3 పెరిగాయన్నారు...2572 మంది మహిళలను రిస్కు చేసి కాపాడామని డిజిపి తెలిపారు అదేవిధంగా 4374 మంది పిల్లలను మిస్సింగ్ కేసులో వారిని పట్టుకు ఈ వారి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. 2018 సంవత్సరంలో మహిళల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలో షీ టీంలు,భరోసా సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. గత ఏడాది తో పోలిస్తే ఈ సారి రోడ్డు ప్రమాదాల సంఖ్య 9.73 శాతం తగ్గాయన్నారు..రోడ్ సేఫ్టీ విషయంలో అధికారులు చోరువ తీసుకున్నందుకే ప్రమాదాలు తగ్గాయన్నారు....రాష్ట్ర వ్యాప్తంగా సిఐడి పరిధిలో ఉన్న రేపు కేసులు మోత్తం ఈ ఎడాది 27 శాతం పెరిగాయన్నారు.

ఈవెంట్స్ ను సక్సెస్ ఫుల్ గా....

తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే విధంగా తెలంగాణ పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీల పై ఉక్కుపాదం మోపుతామన్నారు డీజీపి. ఫేక్ సర్టిఫికెట్ నుండి నకిలీ పదార్థాల తయారీ ధారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు... అదేవిధంగా ఆన్ లైన్ మోసాల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ కు ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ఫ్రెండ్లీ పోలీసింగ్ ను బలోపేతం చేస్తామన్నారు డిజిపి. తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ కు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇప్పటికే ఈ వెల్ఫేర్ నుండి 2 కోట్ల 56 లక్షల రూపాయలు ఇప్పటికె లోన్స్ ఇచ్చామన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ అగ్రస్థానంలో ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని డీజీపి తెలిపారు.దేశంలోనే ఎక్కడా లేని విధంగా హోం గార్డులు 12 వేల నుండి ఒకే సారి 20 వేల వరకు జీతాన్ని తెలంగాణ ప్రభుత్వం సహకారం తో పెంచామన్నారు. దింతో పాటు వారికి అన్ని ఆరోగ్య భీమా.సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామన్నారు.

డ్రగ్స్ కేసులను...

డ్రగ్స్ పై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యే దృష్టి సారించామన్నారు. మత్తు మారక ద్రవ్యాలను కోనుగోలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది అనేక సదస్సులను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతం చేశామన్నారు. అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సు, ప్రపంచ తెలుగు మహాసభలతో పాటు రాచకొండ,సైబారాబాద్ పరిసరాల్లో జరిగినటువంటి అంతార్జాతీయ ఈవెంట్లను చాలా సక్సస్ ఫుల్ చేశామన్నారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుండి ఐపీఎస్ ఆఫీసర్ వరకు రిటైర్ అయిన వెంటనే ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేసి వారికి ప్రమోషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

కొత్తగా నియామకాలు...

2018 సంవత్సరం లో నూతనంగా 17 వేల కానిస్టేబుల్ పోస్టులకు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వీటన్నీంటిని త్వరలో పూర్తి చేస్తామన్నారు..అదేవిధంగా ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్న మరో కోద్ది రోజుల్లో 10 వేల మంది నూతన కానిస్టేబుల్స్ వచ్చిన తర్వాత వారంతపు సెలవు పై ఆలోచిస్తామన్నారు...2018 సంవత్సరం లో నయీమ్ అనుచరుడు అయిన శేషన్న ను అరెస్ట్ చేస్తామని త్వరలోనే నయూమ్ భాదితులకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కు ఇంటర్నేషనల్ స్థాయి అవార్డులు వచ్చాయన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ కు మంచి పేరు తేచ్చే విధంగా అందరం కృషి చేస్తామని ఇంకా అనేక అవార్డులు రావడానికి తెలంగాణ పోలీస్ శాఖ పనిచేస్తుదని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేరాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంత పెరిగినా కూడా శాంతి భద్రతల విషయంలో మాత్రం తెలంగాణ పోలీసుల తీరు బేష్ గా నే ఉందని చెప్పాలి. మరీ పెండింగ్ లో ఉన్న కీలక కేసుల పరిష్కారానికి తెలంగాణ పోలీస్ శాఖ పనితీరు వచ్చే సంవత్సరం ఏవిధంగా ఉంటుందో అన్నది వేచి చూడాలి మరి.

Similar News