కాషాయ కండువాను కప్పుకోనున్న కృష్ణ

Update: 2017-02-04 07:30 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ భారతీయ జనతా పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. కృష్ణ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. అయితే కృష్ణ రాజీనామాపై ఇంతవరకూ పార్టీ హైకమాండ్ స్పందించలేదు. కాని కృష్ణ మాత్రం తనను పార్టీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీనియర్లను పక్కనబెడుతుందని విమర్శించారు. రాహుల్ నాయకత్వం వచ్చిన తర్వాత చిన్నగా పెద్దతరాన్ని తప్పిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. వృద్ధులైన వారిని పార్టీ పదవులు కూడా కట్టబెట్ట కూడదన్నది యువనేత నిర్ణయం కావడంతీ సీనియర్ నేత కృష్ణ ను కూడా పక్కన పెట్టారు. దీంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.

ఎప్పుడో తెలీదు గాని.....

అయితే ఎస్ ఎం కృష్ణ కర్ణాటక రాజకీయాల్లో మంచి పేరున్న వ్యక్తి. ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కృష్ణను తమ పార్టీలోకి చేర్చుకుని కర్ణాటకలో బలోపేతం చేయాలని కమలనాధులు భావిస్తున్నారు. అందుకు కృష్ణ కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కృష్ణ బీజేపీలో చేరుతున్నట్లు చెప్పేశారు. అయితే ఎప్పుడో చేరతారో ఖచ్చితంగా చేప్పలేను కాని, కృష్ణ కాషాయకండువా కప్పుకోవడం ఖాయమని యడ్యూరప్ప బయట పెట్టేశారు. దీంతో ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరుతున్నట్లు స్పష్టమైపోయింది.

Similar News