కాంగ్రెస్ వాళ్ళు సన్నాసులా!

Update: 2016-08-24 07:08 GMT

మహారాష్ట్ర ప్రభుత్వం తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ జల ఒప్పందం చేసుకుని ఈ రోజు (24-08-16) హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ మంత్రులు, అధికారులు ఘన స్వాగత పలికారు. అయన ఎయిర్ పోర్ట్ నుండి ఊరేగింపుగా బయలు దేరారు. ఇక ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఈ జల ఒప్పందాన్ని కాంగ్రెస్ వారు తప్పుపడుతున్నారని..వారికి అసలేం తెలుసునని మాట్లాడాడుతున్నారని కేసీఆర్ అన్నారు. ఉత్తమ్ దమ్ముంటే ఎయిర్ పోర్ట్ కి రావాలని ఛాలెంజ్ చేశారు. నేను తప్పు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఘోషకు కారణం కాంగ్రెస్ వారే కారణం అన్నారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి కోటిరతనాల వీణాగా తెలంగాణాని తీర్చు దిద్దడానికి మేము కృషి చేస్తున్నామని కేసీఆర్ అన్నారు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు సన్నాసులు అని ఘాటుగా మాట్లాడారు. కాంగ్రెస్ వారికి పౌరుషం ఉంటే నాతొ చర్చకు సిద్ధం కండి అని అన్నారు. నా ప్రాణం పోయినా రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇంకా కాంగ్రెస్ వారు తెలంగాణ ప్రభుత్వం ఏ మంచి పని చేసిన చూసి ఓర్వలేకపోతున్నారని అందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. గోదావరి జలాలతో ఒప్పందం ఇది చరిత్రలో లిఖించబడుతుందని కేసీఆర్ అన్నారు. ఇంకా అయన త్వరలో గ్రామాలకు బస్సు యాత్ర చేపడతానని అన్నారు. రైతులకున్న సమస్యలు తెలుసుకుని వాటిని సత్వరం పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

Similar News