కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే

Update: 2017-03-02 04:05 GMT

జిల్లా కలెక్టర్ ను వైసీపీ అధినేత జగన్ దూషించాడని ఏపీలో కేసు నమోదు చేస్తే తెలంగాణలోనూ ఎమ్మెల్యే కలెక్టర్ ను దూషించిన సంఘటన జరిగింది. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మధ్య వాగ్వాదం జరిగింది. కరీంనగర్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వరంలో డిజి ధన మేళాను నిర్వహించారు. దీనికి కేంద్రమంత్రి దత్తాత్రేయ కూడా హాజరరయ్యారు. ఎంపీ వినోద్ కుమార్ కూడా సభకు వచ్చారు. అయితే సభలో పెట్టిన ఫ్లెక్సీ పై ఎంపీ వినోద్ కుమార్ ఫొటో లేదని ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్ లు అభ్యంతరం వ్యక్తం చేశారు.

డోన్ట్ టాక్...

మంత్రి ఈటెల రాజేందర్ సమక్షంలో వారు కలెక్టర్ తో వాగ్వాదానికి దిగారు. ఎంపీ ఫొటోలను పెట్టడం ఎలా మర్చిపోయారంటూ కలెక్టర్ ను ప్రశ్నంచారు. ప్రజాప్రతినిధులంటే గౌరవం లేదా అని నిలదీశారు. ఎంపీ వినోద్ కుమార్ నవ్వుతూ ఉండిపోయారు. అయితే సర్ఫరాజ్ అహ్మద్ పై రసమయి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కలెక్టర్ కు కోపమొచ్చింది. ఎమ్మెల్యే రసమయిని ఉద్దేశించి డోన్ట్ టాక్ అని ఆగ్రహంతో అనడంతో మంత్రి ఈటల రాజేందర్ జోక్యం చేసుకున్నారు. కలెక్టర్ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ రసమయి పట్టుబట్టారు. ఈటల సర్దిచెప్పడంతో సభ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ సూచనలమేరకే మేళా ఏర్పాట్టు చేశామని, ప్రొటోకాల్ కూడా వారు చెప్పినట్లే చేశామన్నారు కలెక్టర్.

Similar News