ఏవండీ... ఆవిడను వదిలిపెట్టండి

Update: 2018-02-23 08:00 GMT

పోలీసు శాఖలో మరొక అక్రమ సంబంధం వెలుగు చూసింది. భార్య వుండగానే మరొక లేడీతో సంబంధం పెట్టుకుని కాపురం చేస్తున్న తీరు ఇది. నలుగురు పిల్లలు వున్నప్పటికి వారిని వదిలి మతం మార్చుకుని మరొక మహిళతో సహాజీవనం చేస్తున్న ఖాకీ భర్తపైన డిజిపికి ఫిర్యాదు చేసింది భార్య. సిటి పోలీసులో హెడ్ క్వార్టర్స్ లో డిసిపిగా పనిచేస్తున్న బాబురావుపైన డిజిపి కి భార్య వేదశ్రీ ఫిర్యాదు చేసింది.. తనతో 25 ఏళ్ళు కాపురం చేసి 4 గురు పిల్లలకు తండ్రి అయిన తరువాత వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. మతం మార్చుకొని విడాకులు ఇవ్వకుండానే సహజీవనం చేస్తున్న డీసీపీ బాబురావు. సౌత్ జోన్ ఆడిషన్ డీసీపీ గా పనిచేసినప్పుడు చాలా మంది తో అక్రమ సంబంధాలు ఉన్నాయని భార్య ఆరోపణ చేస్తున్నారు. 5 లక్షలు ఇస్తానని, విడాకులు ఇవ్వాలని బాబూరావు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. తనకు చెందిన ఆస్తీని ప్రస్తుతం వున్న భార్య పేరు రిజిస్టర్ చేయించుకున్నాడని, తనకు తెలియకుండానే తన ఆస్తి మొత్తాన్ని కూడా తీసుకున్నాడని వాపోయారు. పోలీస్ శాఖకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్న బాబురావు పై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డికి పిర్యాదు చేసింది ఆవిడ.

Similar News