ఏపీకి పెట్టుబడుల వరద

Update: 2017-01-28 13:23 GMT

విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో పెట్టుబడుల మోత మోగుతోంది. తొలిరోజు అదిరిపోయే ఆరంభాన్నిచ్చిన సదస్సు రెండో రోజు కూడా లక్షల కోట్ల పెట్టుబడులతో ఒప్పందం కుదర్చుకునేలా చేసింది. రెండో రోజు కూడా ఎంవోయూలు భారీగానే జరిగాయి. ఈ సదస్సు ద్వారా మొత్తం 10.25 లక్షల కోట్ల రూపాయల మేర ఒప్పందాలు జరిగినట్లు సీఐఐ నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తం 665 అవగాహన ఒప్పందలు కుదిరాయని, ఈ ఒప్పందాల కారణంగా 22 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు చెబుతున్నాయి.

విశాఖలో భాగస్వామ్య సదస్సు జరిగినా ఏపీ రాజధాని అమరావతికి పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయి. అమరావతి రాజధాని పరిధిలో దాదాపు 1.29 లక్షల కోట్ల మేరకు 62 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఈ ఎంవోయులు కుదుర్చుకున్నారు. మొత్తం మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భాగస్వామ్య సదస్సు విజయవంతంగా ముగిసింది. కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల్లో చాలా వరకూ గ్రౌండ్ అవుతాయని ముఖ్యమంత్రి విశ్వసిస్తున్నారు. అందుకే ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమై వారికి పరిస్థితిని వివరించారు. ఏపీలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు భవిష్యత్ ఉంటుందని భరోసా ఇచ్చారు. దీంతో కంపెనీల ప్రతినిధులు కూడా ఉత్సాహంగా ఉన్నారని, వీలయినంత త్వరలో వీటిని గ్రౌండ్ చేయడానికి ప్రయత్నిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు.

Similar News