ఏపీ ప్రభుత్వానికి పవన్ వార్నింగ్

Update: 2017-12-23 07:17 GMT

విశాఖలోని పెందుర్తిలో దళిత మహిళపై కొందరు అనుచితంగా ప్రవర్తించిన తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. దీనిపై వెంటనే ప్రభుత్వం విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు రోజుల క్రితం విశాఖలోని పెందుర్తిలో ఒక దళిత మహిళను వివస్త్రను చేసి కొందరు అరాచకంగా వ్యవహరించారు. దీనిపై మహిళాసంఘాలు, వైసీపీ నేతలు ఉద్యమించారు. దీనికి పవన్ కల్యాణ్ ట్విటర్లో స్పందించారు.

వెంటనే చర్యలు తీసుకోవాలి...

‘నేను ఈ సంఘటనపై తీవ్రంగా కలత చెందాను. ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ప్రజల్లో వ్యతిరేక సంకేతాలు వెళుతున్నాయి. గతంలో కారంచేడు, చుండూరులోనూ ఇలాగే జరిగింది. అధికారులు చూస్తూ ఉండకూడదు. నేను వస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. నేను అందుకే ఈవిషయంలో నేరుగా జోక్యం చేసుకోలేదు. బాధిత మహిళకు న్యాయం చేయండి. మీడియా కూడా దీన్ని ఎక్కువగా సెన్సేషనల్ చేయవద్దు’ అని పవన్ కోరారు.

Similar News