ఏపీ ప్రజలంత సంతోషంగా ఎవరూ లేరట..!

Update: 2017-11-10 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారట. ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉన్నారట. ఇవి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఇటీవలనిర్వహించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం ద్వారా తెలిసిందట. ఎమ్మెల్యేలు కూడా ప్రజల నమ్మకాన్ని పొందాలన్నారు చంద్రబాబు. సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ అందుతుండటంతో ఏపీ ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని టీడీపీ అధినేత సెలవిచ్చారు. మరోవైపు జగన్ పాదయాత్రలో మాత్రం సమస్యలపై సమస్యలు వచ్చి పడుతున్నాయి. పసుపురైతులు, ఉపాధ్యాయ సంఘాలు, డ్వాక్రామహిళలు, పింఛను అందని వారు జగన్ ను కలుస్తూ తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. మరి చంద్రబాబు చెబుతున్నది నిజమా....? జగన్ వద్దకు వచ్చే వారు కిరాయి వారా? అన్నది ఏపీ ప్రజలే తేల్చుకోవాల్సి ఉంటుంది.

జగన్ సవాల్ స్వీకరించం.....

మరోవైపు జగన్ సవాల్ పై ఏపీ ఆర్థిక మంత్రి యనమల విచిత్రంగా స్పందించారు. జగన్ సవాల్ ను తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాము హుందాగా ప్రవర్తిస్తామన్నారు. జగన్ సవాళ్లకు సమాధానం చెప్పి తమ స్థాయిని దిగజార్చుకోమన్నారు యనమల. మరి ప్యారడైజ్ పేపర్స్ లో జగన్ పాత్ర ఉందంటూ విమర్శలు చేసిన టీడీపీ నేతలు హుందాగా ప్రవర్తించారా? యనమల గారూ అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్యారడైజ్ పేపర్స్ లో జగన్ పేరు ఉందని పదే పదే చెబుతున్న టీడీపీ నేతలు జగన్ సవాల్ విసిరిన వెంటనే ఎందుకు తోక ముడిచారని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఏపీ ప్రజలు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారట. సో... దేశంలో ఏపీ ప్రజలకు మించిన వారు లేరన్నది చంద్రబాబు గారి భావన. మీరు నమ్మితే నమ్మండి... లేకుంటే లేదు.

Similar News