ఏపీ అసెంబ్లీ బాగాలేదన్న మంత్రి ఇతనే...

Update: 2017-03-07 16:30 GMT

రికార్డు సమయంలో అద్భుతంగా నిర్మించామని ముఖ్యమంత్రి గొప్పలు చెబుతుంటే ఆయన కాబినెట్ లో మంత్రి మాత్రం నిర్మాణాలపై పెదవి విరుస్తున్నారు. ప్రతిపక్షాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా కొందరు మంత్రులు., విప్ లకు పెద్ద ఎత్తున గదులు కేటాయించారు. అయితే తమకు కేటాయించిన గదుల అగ్గి పెట్టె ల్లా ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు కామెంట్ చేసారు.అసెంబ్లీ లో మంత్రుల ఛాంబర్లు సరిగా లేవని., అగ్గిపెట్టెల మాదిరిగా ఉన్నాయని., మంత్రులకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఛాంబర్లు ఇస్తే బాగుండేదని చెప్పారు. ఇక సభలో ఏర్పాటు చేసిన మైకులు కూడా సరిగా లేవని., ఆడియో వ్యవస్థ సరిగా లేదని లాబీలో చెప్పుకొచ్చారు.

కొత్త అసెంబ్లీలో సమావేశాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. పార్టీలకతీతంగా అందరూ పలుకరించుకోవడం కన్పించింది. కొందరినైతే ఏకంగా మంత్రిగారూ అని సంబోధించడ కన్పించింది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉందన్న వార్తలు వస్తుండటంతో కొందరు ఎమ్మెల్యేలను మంత్రులుగా కూడా పిలుస్తున్నారు. మొత్తం మీద గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రశాంతంగా జరిగింది. అనంతరం శాసనసభ, శాసనమండలి సోమవారానికి వాయిదా పడ్డాయి.

Similar News