ఎమెల్యేలు పార్టీలు ఎందుకు మారతారో... !

Update: 2016-04-11 23:39 GMT

ప్రస్తుతం తెలుగు రాష్ట్రలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై తనదైన శైలిలో స్పదించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీలు మారటానికి బలమైన కారణాలుండాలి. కానీ ఈరోజు ఎమ్మెల్యేలంతా ఎందుకు పార్టీ మారుతున్నారో అందరికీ తెలుసు అని ఘాటు గా స్పదించారు పవన్. ఈ విషయంలో తనకు కమ్యూనిస్టు లీడర్లంటే గౌరవం. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా పార్టీ మారటానికి వారు ఇష్టపడరు అని చెప్పుకొచ్చారాయన.

అలాగే తన పార్టీ భవిష్యత్ కార్యాచరణ పై మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనీ భావిస్తున్నామని, అయితే ఎన్ని స్థానాలలో పోటీ చేస్తాననేది ఆ రోజు పరిస్థితుల్ని బట్టి ఉంటుందని, పదవి నా లక్ష్యం కాదని, ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం కావాలి. వాళ్ల గళాన్ని వినిపించే నాయకుడు కావాలి, దానిపైనే తన దృష్టని చెప్పుకొచ్చారాయన.

Similar News