ఎన్నికల వేళ ...కష్టాల్లో మాయావతి

Update: 2017-02-15 13:30 GMT

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి కష్టాల్లో చిక్కుకున్నారు. భూ రికార్డులను తారుమారు చేశారన్న ఆరోపణలపై హైకోర్టు మాయావతికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఉతర్త ప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాయావతికి నోటీసులు జారీ చేయడం బీఎస్పీలో కలకలం రేగింది. ఈ నోటీసుల ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడుతుందని బీఎస్సీ నేతుల కంగారు పడుతున్నారు.

సీఎంగా ఉన్నప్పుడు.....

మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రేటర్ నోయిడా సమీపంలో ఉన్న బదల్ పూర్ గ్రామంలో భూముల రికార్డులు తారుమారు చేశారని అలహాబాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్ ను హైకోర్టు విచారణకు చేపట్టింది. బదల్ పూర్ గ్రామంలోని 47 వేల చదరపు మీటర్ల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మాయావతి డిక్లేర్ చేశారని సోషల్ వర్కర్ సందీప్ బాటి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ భూమిని గృహ నిర్మాణం కోసం ప్లాట్లుగా వేసి విక్రయించాలన్నది ఈ భూమార్పిడి వెనుక ఉన్న కుట్రగా పిటిషనర్ ఆరోపించారు. మాయావతితో పాటుగా సోదరుడు ప్రభుదయాల్, మేనల్లుడు ఆనంద్ కుమార్ ల పేర్లను కూడా తన పిటిషన్ లో చేర్చారు. దీంతో అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. ముందుగా మాయవతితో పాటు సోదరుడు, మేనల్లుడికి కూడా నోటీసులను పంపింది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఈ నోటీసుల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండో దశ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే నోటీసులు రావడంతో మాయవతి కూడా కొంత ఆశ్చర్యానికి...నిరాశకు గురయ్యారని తెలుస్తోంది.

Similar News