ఎన్నికల ఏడాది గేర్ మార్చిన బాబు ...!

Update: 2017-12-31 03:30 GMT

ఎప్పుడు ఏ స్టెప్ వేయాలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు కి వెన్నతో పెట్టిన విద్య . 2014 లో అధికారం చేపట్టిన వెంటనే కొత్త రాష్ట్రం ఏపీకి ఆదాయ మార్గంగా కోడిపందాలు, జూదం, ఇతర ఎంటర్ టైన్మెంట్ లకు లైసెన్స్ లు మంజూరు చేసి అధికారికంగా నిర్వహించాలనే ఆలోచన చేశారు బాబు. పర్యాటకంగా దీనివల్ల పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది అన్నది ఆయన ఆలోచన. బ్యాంకాక్ వంటి పలు దేశాలు టూరిజం మీదే ప్రధానంగా ఆధారపడుతున్న నేపధ్యాన్ని అధ్యయనం చేసే చంద్రబాబు ఆ విధమైన కార్యాచరణకు సంకల్పించారు. కానీ సీన్ రీవర్స్ అయ్యింది. ఆయన ఆలోచనలకు జనం నుంచి వచ్చిన వ్యతిరేకత బ్రేక్ లు పడేలా చేసింది.

సోషల్ మీడియా ఎఫెక్ట్ తో వెనక్కి తగ్గిన బాబు ...

చంద్రబాబు సర్కార్ కోడిపందాల వ్యవహారంపై ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు చెలరేగిపోయారు. ఆదాయం వస్తుందని వ్యభిచారానికి లైసెన్స్ లు మంజూరు చేసేలా ఉన్నారంటూ సెటైర్లు పంచ్ లు ప్రభుత్వంపై నెలల తరబడి పడ్డాయి. ముఖ్యంగా జూదం గ్యాంబ్లింగ్ వంటి అంశాల్లో తమ సంసారాలు గుల్లయి రోడ్డున పడుతున్నామని అరికట్టాలిసిన ప్రభుత్వం ప్రోత్సహించడం ఏమిటంటూ మహిళలో ఆందోళన పెల్లుబికడంతో ప్రతిపాదన దశలోనే ప్రభుత్వం ఈ ఆలోచన విరమించుకుంది.

సరికొత్త బాబు ఇక కనిపిస్తారు ....

ఎన్నికల ఏడాది కావడంతో చంద్రబాబు పూర్తిగా మారిపోయారు. గతంలో తన ఆలోచనలకు భిన్నంగా స్పందిస్తున్నారు బాబు. కోడిపందాల జోలికి పోవద్దంటూ నేతలకు ఆదేశాలు ఇవ్వడం వెనుక జనం ఛీ కొట్టకుండా ముందు జాగర్తలు తీసుకుంటున్నారు. గతంలో గోదావరి జిల్లాల్లో గత నాలుగేళ్లుగా కోడిపందాలు యథేచ్ఛగా సాగాయి. ప్రజాప్రతినిధులు నేరుగా వీటిని నిర్వహించడం ప్రోత్సహించడం చేసినా బాబు సర్కార్ యాక్షన్ లోకి దిగలేదు. పోలీసులు హాయిగా కాసులు దండుకుని కత్తులు కట్టకుండా పోటీలు సంప్రదాయాలంటూ అమాయకులపై అరకొర కేసులు పెట్టి లాభ పడ్డారు. ఇక నేతలు మాత్రం కోట్ల రూపాయలు పందాల బరులు పెట్టి సంపాదించారు. ఇప్పుడు మారిన బాబు వైఖరితో పాటు పోలీస్ అధికారుల హెచ్చరికలతో గోదావరి జిల్లాల్లో పందెం రాయుళ్ళు ఏమి చేయబోతున్నారన్న ఆసక్తి నెలకొంది.

Similar News