ఈ ఖాకీలు ఎంతగా బరితెగించారంటే...!

Update: 2018-01-31 10:54 GMT

పోలీసులు అదుపు తప్పుతున్నారు. ఆసరాగా వచ్చిన అమ్మాయిలను నమ్మించి నయ వంచన చేస్తున్నారు. అనైతిక వ్యవహారాలను కట్టడి చేసి అదర్శంగా నిలవాల్సిన ఖాకీలు బరి తెగించి పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నారు. పర్సనల్ లైఫ్ పేరుతో ఉన్నతాధికారులు చర్యలు పూనుకోకపోవడంతో.. రోజు రోజుకు పోలీసుల వివాహేతర సంబందాలు పెరిగిపోతున్నాయి.

వివాహేతర సంబంధం పెట్టుకుని....

పోలీస్ స్టేషన్.. ఆ ఏరియాలో ఎలాంటి వివాదాలు వచ్చినా పరిష్కరించే పవిత్ర స్థలంగా భావిస్తారు. కాని కుటుంబ వివాదమే ఆసరాగా చేసుకుని అక్రమ సంబందాలు, వివాహేతర వ్యవహారాలు నడిపిస్తున్నారు. అధికారులు, సిబ్బంది అనైతిక వ్యవహారాల గురించి తెలుసుకోవడంలో ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. వివాహేతర సంబంధాల వ్యవహారం తెలిసినా గుప్పిట మూసేస్తున్నారు. బహిర్గతమయ్యాక తప్పుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. మీడియాలో వార్తలు వస్తేనే వేటు వేస్తున్నారు. పెళ్లై జీవిత భాగస్వామి ఉన్నక.. మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నా, విడాకులు తీసుకోకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకున్నా అది తీవ్ర నేరం. కాని ఇవి తెలిసినా.. వారి పై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు.డిపార్ట్ మెంట్ లో కొత్తలో మంచి పేరు తెచ్చుకున్న అధికారులు ఆ తర్వాత వివాహేతర సంబందాలకు మొగ్గుచూపుతున్నారు. ఏసీబీ అదనపు ఎస్పీ సునీత, ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జునరెడ్డి సంబంధం పోలీస్‌శాఖను తీవ్రంగా కుదిపేసింది. ఆమె భర్త రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకోవడంతో పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు ఇద్దరినీ సస్పెండ్‌ చేశారు.

సహజీవనం సాగిస్తూ....

ఇక చాదర్‌ఘాట్‌ ఠాణాలో పనిచేసిన ఒక ఇన్‌స్పెక్టర్‌... రోడ్డు ప్రమాదంలో భర్తను పోగొట్టుకున్న ఓ మహిళ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని లోబరచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానంటూ మరో యువతిని మోసం చేశాడు. రాచకొండ కమిషనరేట్ లో పనిచేసిన ఓ ఇన్‌స్పెక్టర్‌ పెళ్లి చేసుకుంటానంటూ యువతిని లొంగదీసుకున్నాడు. తర్వాత వ్యవహారం వెలుగులోకి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మరో ఇన్స్ పెక్టర్..మహిళా పోలీస్‌తో చనువుగా ఉండేవారు. ఆమెను సాయంత్రం 7 గంటల తర్వాత తన కార్యాలయంలోకి రావాలంటూ ఆదేశించేవారు. మొదట్లో ఆమె వ్యతిరేకించినా సదరు అధికారి వేధింపులు తట్టుకోలేక ఒప్పుకొంది. ఓ.యూ పోలీస్ స్టేషన్ లో పని చేసిన ఇన్స్ ప్టెక్టర్ ఇప్పడు ఏసిపి అయ్యారు. ఆయన వివాహేతర సంబంధం పై భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మీడియా ముందు ఉంచింది. మరో అడిషనల్ డిసిపి ఏకంగా భార్యా పిల్లలను వదిలివేసి.. మరో మహిళతో సహాజీవనం చేస్తున్నారు. ఆ మహిళ సూచన మేరకు వివాదాలు రాకుండా మతం మార్చుకున్నారనే అరోపణలు ఉన్నాయి. సోమవారం విజయవాడ కోర్టులో కౌన్సిలింగ్ ఇస్తే 5 లక్షలు ఇస్తానని, విడాకులు ఇవ్వాలని రాజీకి ప్రయత్నం చేశాడు. కాని తనకు మాత్రం భర్తే కావాలని 25 యేళ్లు సంసారం చేసి ఇప్పుడు వద్దంటే ఎలా బతికేదని కోర్టులో కన్నీరు మున్నీరయింది. ప్రస్తుతం అడిషనల్ డిసిపిగా పిటీసీలో పనిచేస్తున్నారు ఆ అధికారి. అయితే అమె మీడియా ముందుకు రాకుండా తన జీవితం నిలబెట్టుకోవాలని చూస్తున్నా పోలీసులు మాత్రం అతని పై చర్యలు తీసుకోవడం లేదు. మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగితేనే ఉన్నాతాధికారులు వేటు వేస్తున్నారు.

ఫేస్ బుక్ తో బుక్కవుతున్నారు....

తాజాగా వివాహితతో ఫేస్‌బుక్‌ ప్రేమాయణం ఓ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. సందీప్ గౌడ్ అనే మెఘల్ పూరా పీ.ఎస్. కానిస్టేబుల్‌ వివాహితతో ఫేస్‌బుక్‌ ప్రేమాయణం నడిపి మహిళను లోబరుచుకున్నాడు. ప్రియుని మోజులో భర్తను వదిలించుకోవడానికి ఆమె అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. అయితే వీరిద్దరి సంబంధాన్ని ఆమె భర్త బయట పెట్టడంతో ఉన్నతాధికారులు కానిస్టేబుల్‌పై వేటు వేశారు. ఇలా బయటపడ్డ కేసుల్లోనే పోలీసులు తీరు మనకు కన్పిస్తుంది. చెప్పుకుంటే తమ విలువ పోతుందని ఎంతో మంది భార్యలు మౌనం దాల్చుతున్నారు. ఇక బాధితులు పోలీస్ స్టేషన్స్ కు వెళితే మాయమాటలతో బుట్టలో వేసుకున్న సంఘటనలు ఏటా 5 నుంచి 8 ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

Similar News