ఇక్కడ టీడీపీ చచ్చిపోయిందా...?

Update: 2017-11-07 04:30 GMT

తెలంగాణ లో టిడిపి చచ్చిపోయిందా ..? ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు ఐటి శాఖామంత్రి కేటీఆర్. టిడిపి నుంచి కంచర్ల భూపాల రెడ్డి మరికొందరు నల్గొండ జిల్లా నేతలు గులాబీ కండువా కప్పుకున్న సందర్భంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇక టిడిపి కనుమరుగైందని కేసీఆర్ నేతృత్వంలో టిఆర్ ఎస్ కి ఎదురు లేదన్నారు కేటీఆర్. అరకొర మిగిలివున్న టిడిపి క్యాడర్ టిఆర్ ఎస్ లో చేరిపోతుందని చెప్పుకొచ్చారు.

వార్ కాంగ్రెస్ తోనే అని తేల్చిన కేటీఆర్ ....

తెలంగాణాలో టిడిపి, బిజెపిల సీన్ అయిపోయినట్లు కెటిఆర్ విశ్లేషిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ టార్గెట్ గా పనిచేయాలని కేటీఆర్ క్యాడర్ కి పిలుపునిచ్చారు. దేశానికి , రాష్ట్రానికి కాంగ్రెస్ శనిలా దాపురించిందని, చీడలా పట్టేసిందని ధ్వజమెత్తుతూ ప్రధాన పార్టీతో మాత్రమే అమితుమీ అని తేల్చి చెప్పేశారు. తమ ప్రత్యర్థి ఎవరో చెబుతూనే ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు. గులాబీ చీడ పట్టి పత్తి పంట పాడైనట్లు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ పాలన కబంధ హస్తాల నుంచి విముక్తి కావాలని విమర్శించారు. దీనికి ప్రతిగా కేటీఆర్ స్పందించడం అసలు చీడ కాంగ్రెస్ వల్లే పట్టిందనడం గమనిస్తే తెలంగాణ రాజకీయాలు ఇకపై హాట్ హాట్ గానే నడవనున్నట్లు తేలిపోతుంది.

Similar News