ఆప్ కష్టాల్లో కూరుకు పోయిందా?

Update: 2017-02-03 06:08 GMT

ఐదు రాష్ట్రాల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్ను శాఖ ఆమ్ ఆద్మీ పార్టీపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదుచేసింది. ఆమ్ ఆద్మీ కి రాజకీయ పార్టీ హోదాను తక్షణమే రద్దు చేయాలంటూ ఐటీ శాఖ ఇచ్చిన సిఫార్సు ఇప్పడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. శనివారం గోవా, పంజాబ్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాక్ తగలింది.

రూ.27 కోట్లకు తప్పుడు లెక్కలు...

ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత గత రెండేళ్లుగా తప్పుడు ఆడిట్ నివేదికలను ఇచ్చిందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. దాదాపు 27 కోట్ల రూపాయల విరాళాల గురించి ఆప్ తప్పడు సమాచారం అందించిందంటున్నారు. ఆడిట్ నివేదికలను పరిశీలించిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు నివ్వెర పోయారట. దీంతో వెంటనే ఆప్ కు రాజకీయ పార్టీ హోదా గుర్తింపును రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఐటీ శాఖ లేఖ రాసింది. మొత్తం ఆరు పేజీల ఉన్న ఈ నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుందట. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పంజాబ్, గోవా ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందోనని ఆప్ నేతల్లో కూడా కలవరం మొదలైంది. నిత్యం అవినీతి నిర్మూలనపై ప్రసంగించే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏం చెబుతారో.

Similar News