ఆ పదిమంది వైసిపి ఎమ్యెల్యేలు టిడిపిలోకేనా ..?

Update: 2017-11-07 05:30 GMT

వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం అయ్యింది. వైసిపి చరిత్రలో ఒక నూతన అధ్యయనానికి తెరతీసిన జగన్ పాదయాత్రకు పదిమంది ఎమ్యెల్యేలు డుమ్మా కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. సాధారణంగా ఇది పెద్ద ప్రాధాన్యత లేని అంశమే . కానీ టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ తో జగన్ పాదయాత్రను వీక్ చేసేందుకు సిద్ధంగా వుంది. ఈ నేపథ్యంలో ఆ పదిమంది రాకపోవడం వారిలో కొందరు పసుపు కండువా కప్పుకునేందుకు సిద్ధం అవుతున్నారన్న ప్రచారం మైండ్ గేమ్ లో భాగంగా అధికార పార్టీ మీడియా లో అధికారపార్టీ హైలెట్ చేయడం తో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

జగన్ పాదయాత్రకు రాని ఎమ్యెల్యేలు ఎవరు ..?

వైసిపి అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభానికి రానివారిలో కర్నూల్ జిల్లా నేతలు గౌరు చరితారెడ్డి , సాయి ప్రసాద రెడ్డి , బాల నాగిరెడ్డి , బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి , చిత్తూరు జిల్లాకు చెందిన చింతల రామచంద్ర రెడ్డి , గుంటూరు జిల్లా కు చెందిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి , నెల్లూరు జిల్లా కు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వున్నారు. వీరిలో కొందరు వ్యక్తిగత పనుల మీద పార్టీ పనులమీద వేరే ప్రాంతంలో ఉన్నామని సమాచారం అందించారు. మరికొందరు అధినేతకు రాలేకపోతున్నామని కూడా చెప్పలేదు. దాంతో వీరిలో కొందరిపై పార్టీ మారిపోతారన్న ఊహాగానాలు మొదలయిపోయాయి. అయితే అధినేత జగన్ ఈ వ్యవహారాలను సీరియస్ గా తీసుకోవడం లేదట. ఎవరెవరు పార్టీ మారతారు అన్న అంశాన్ని మాత్రం పార్టీ మీడియా ద్వారా సమాచారం మాత్రం తెప్పించుకుని వారి పరిస్థితి విశ్లేషిస్తున్నారు. అయితే వీరిలో ఎవరూ పార్టీ మారే అవకాశం లేదని వైసీపీవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం టీడీపీ మైండ్ గేమ్ లోభాగంగానే ఇదంతా జరుగుతుందని వైసీపీ నేతలు తెలిపారు.

Similar News