అరవ రాజకీయాలలో ఇప్పుడు కాసేపు విరామం.......

Update: 2017-02-05 07:35 GMT

శశికళ చేతికి పగ్గాలు లేనట్టే.....

ఈ నెల 9 లేదా 10న నియామకం ...?

అన్నాడీఎంకేలో జరుగుతున్న అధికార పోరు పూటకో మలుపు తిరుగుతోంది. ఆదివారం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో శశికళ నిర్వహిస్తున్న సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఊహాగానాలకు కొందరు నేతలు తెరదించారు. ఆదివారం జరిగి భేటీలో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకుంటారని, ఆ తర్వాత ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపడతారని కథనాలు వచ్చాయి సంగతి తెలిసిందే. అయితే, ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో చివరినిమిషంలో అజెండా మారినట్టు తెలుస్తోంది. శశికళ నిర్వహిస్తున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భేటీపై వస్తున్న కథనాలపై ఆ పార్టీ సీనియర్‌ నేతలు స్పందించారు.

శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు ఉద్దేశించిన సమావేశం కాదని, కేవలం పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకే ఆమె ఈ భేటీని ఏర్పాటుచేశారని వారు స్పష్టం చేశారు. ఈ భేటీలో సీఎంగా చిన్నమ్మ నియామకం ఉండబోదని చెప్తున్నారు. ఈ నెల 9న లేదా 10న నిర్వహించే సమావేశంలో శశికళ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిపారు. మరోవైపు శశికళ సీఎం పగ్గాలు చేపట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారని, ఈమేరకు రాజ్‌భవన్‌కు కూడా సమాచారం అందిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, రాజీనామాకు పన్నీర్‌ సెల్వం సుముఖంగా లేకపోవడం.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే శశికళ నియామకానికి కొంత బ్రేక్‌ పడినట్టు భావిస్తున్నారు. అటు డిఎంకే కూడా పన్నీర్‌ సెల్వానికి మద్దతు ప్రకటించడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ తమిళనాడులో నెలకొంది.

మరోవైపు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారని వస్తున్న కథనాలపై జయలలిత మేనకోడలు దీపాకుమార్‌ స్పందించారు. 'శశికళ తీరు సైనిక కుట్రను తలపిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నవారిని మార్చి తాను అకస్మాత్తుగా పగ్గాలు చేపడితే దానిని ప్రజలు ఒప్పుకోబోరని దీపా చెప్పారు. అన్నాడీఎంకే తుది నిర్ణయం తీసుకునేవరకు వేచిచూడటం మంచిదని చెప్పారు. సీఎంగా శశికళ పగ్గాలు చేపట్టాలని తమిళ ప్రజలు కోరుకోవడం లేదని., తమిళనాడు ప్రజలకు అంతతి దుస్థితి వస్తుందని డా అనుకోవడం లేదన్నారు. శశికళ ప్రజాస్వామికంగా ఎన్నుకోబడిన నేత కాదని కావాలనే జయలలిత సలహాదారు అయిన షీలాబాలకృష్ణన్‌ ను పక్కా ప్లాన్‌తోనే పదవి నుంచి తప్పించారని దీపా ఆరోపించారు.

Similar News