అజారుద్దీన్ డకౌట్

Update: 2017-01-14 06:44 GMT

మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు హెచ్.సి.ఏ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. అజ్జూ ఈ ఎన్నికల్లో డకౌట్ అయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అజారుద్దీన్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారి అజ్జూ భయ్యా నామినేషన్ ను తిరస్కరించారు. అజారుద్దీన్ పై బీసీసీఐ నిషేధం ఎత్తివేయకపోవడంతో నామినేషన్ ను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.

అజారుద్దీన్ ఎన్నికల బరిలోకి రావడంతో వేడెక్కాయి. అయితే తొలిదశలోనే నామినేషన్ తిరస్కరణ కు గురి కావడంతో అజారుద్దీన్ క్యాంప్ నైరాశ్యంలోకి వెళ్లింది. అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ లో బహిష్కరణకు గురయ్యారు. అయితే హైకోర్టు అజారుద్దీన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. కాని 2012 నుంచి బీసీసీఐ అజ్జూపై నిషేధం తొలగించలేదు. దీంతో నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. అజారుద్దీన్ కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఓటు హక్కు కూడా లేదు. కాని లోధా కమిటీ సిఫార్సుల మేరకు అజార్ నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అకారణంగా తన నామినేషన్ ను తిరస్కరించారని అజార్ చెప్పారు. లోధా కమిటీ సూచనల మేరకు ఎన్నికలు జరగడం లేదన్న ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వివేక్ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు. సస్పెండ్ అయిన వ్యక్తిని సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎలా ప్రకటిస్తారన్నారు అజారుద్దీన్.

Similar News