జగన్ అనూహ్య నిర్ణయం...!

Update: 2018-08-09 05:30 GMT

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. మరికాసేపట్లో జరగనున్న ఎన్డీఏ తరుపున హరివంశ్ నారాయణ్ సింగ్(జేడీయూ ఎంపీ), కాంగ్రెస్ తరుపున బీకే హరిప్రసాద్ పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించింది. అశాస్త్రీయంగా విభజించి, హామీలను చట్టంలో చేర్చకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. రాష్ట్రాన్ని మోసం చేసిన రెండూ పార్టీలకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ ప్రకటించింది.

Similar News