బ్రేకింగ్ : వేటకొడవళ్లతోనే నరికారా…??

వైఎ వివేకానందరెడ్డి హత్య కేసును స్పెషల్ ఇన్విస్టిగేషన టీమ్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుధాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. [more]

Update: 2019-03-15 13:17 GMT

వైఎ వివేకానందరెడ్డి హత్య కేసును స్పెషల్ ఇన్విస్టిగేషన టీమ్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుధాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు నిందితులు వేటకొడవళ్ల వాడినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న ఉదయమే వివేకా హత్యకు రెక్కీ జరిగిందని కూడా పోలీసులు చెబుతున్నారు. రేపు వివేకానందరెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతుండటంతో కడప జిల్లాకు అదనపు పోలీసు బలగాలను రప్పిస్తున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పాతకక్ష్యలతోనే ఈ హత్య జరిగిందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.

Tags:    

Similar News