కోవిడ్ తో నష్టపోయాం… కేంద్రమే ఆదుకోవాలి

కోవిడ్ తో నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈరోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ [more]

Update: 2020-05-11 12:40 GMT

కోవిడ్ తో నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈరోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ ప్రధాని ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు. రాష్ట్రాలకు వడ్డీలేని, తక్కువ వడ్డీ ఉండే దీర్ఘకాలక రుణాలివ్వాలని జగన్ కోరారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలకు పదహారు వేల కోట్లరూపాయలు అవసరమన్నారు. ప్రజారోగ్యానికి ఇచ్చే రుణాలను ఎఫ్ ఆర్బీఎం నుంచి మినహాయించాలన్నారు. మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు ఆరు నెలల కాలానికి వడ్డీ మాఫీ చేయాలని జగన్ మోదీని కోరారు. ఉద్యానవన పంటలతో పాటు మరికొన్నింటికి కనీస మద్దతు ధర కల్పించాలన్నారు. పంటల సేకరణకు 30 నుంచి యాభై శాతం కాలపరిమితి ఇవ్వాలన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిధిని కూడా పెంచితే బాగుంటుందని జగన్ మోదీకి తెలిపారు.

Tags:    

Similar News