దిగి వచ్చిన జగన్ ప్రభుత్వం

హైకోర్టు తీర్పుతో జగన్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని కోర్టు స్పష్టం చేయడంతో జగన్ తో మంత్రులు బొత్స [more]

Update: 2020-03-02 13:28 GMT

హైకోర్టు తీర్పుతో జగన్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని కోర్టు స్పష్టం చేయడంతో జగన్ తో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను 59 శాతం నుంచి యాభై శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ హైకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వం నడుచుకుంటుందని చెప్పారు. రిజర్వేషన్లను యాభై శాతం మేరకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసకున్నామని చెప్పారు. కోర్టు ఆదేశాలకు లోబడే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని చెప్పారు.

Tags:    

Similar News