సీమకు శాశ్వత మేలు

కుందూ, కేసీ కెనాల్ ఆయకట్టును రక్షించేందుకు ప్రణాళిక రూపొందించామని, ఇందుకు నిధులు కూడా కేటాయించామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న జగన్ జొలదరాసి వద్ద, [more]

Update: 2019-12-23 08:48 GMT

కుందూ, కేసీ కెనాల్ ఆయకట్టును రక్షించేందుకు ప్రణాళిక రూపొందించామని, ఇందుకు నిధులు కూడా కేటాయించామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న జగన్ జొలదరాసి వద్ద, దువ్వూరు నుంచి బ్రహ్మసాగర్ కు నీటి తరలింపు, తెలుగు గంగ ఆయకట్టు స్థిరీకరణ వంటి ప్రాజెక్టుకు జగన్ శంకుస్థాపన చేశారు. దాదాపు 2,100 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు జగన్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో తాగు, సాగునీటి సమస్య తీరుతుందన్నారు. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ, బనగానపల్లె నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని జగన్ తెలిపారు. రాయలసీమకు శాశ్వతంగా మేలు చేకూర్చుడం కోసమే ఈ ప్రయత్నమని జగన్ తెలిపారు. గత ప్రభుత్వం పట్టించుకోని ప్రాజెక్టులను తాము చేపడతామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News