లోకేష్ ను ఓడించే వ్యూహం పన్నిన జగన్

మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే తన క్యాబినెట్ లో మంత్రిగా ఉంటారని, మంగళగిరి ప్రజల ఆస్తులు కాపాడతాడని, మంగళగిరిలో ప్రజలను అభివృద్ధి చేస్తాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ [more]

Update: 2019-04-09 06:18 GMT

మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే తన క్యాబినెట్ లో మంత్రిగా ఉంటారని, మంగళగిరి ప్రజల ఆస్తులు కాపాడతాడని, మంగళగిరిలో ప్రజలను అభివృద్ధి చేస్తాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మంగళగిరిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… రామకృష్ణారెడ్డి లోకల్ హీరో అన్నారు. వ్యవసాయం చేసుకుంటూ తనతో పాటు పది మందికి రాజన్న క్యాంటిన్ లో అన్నం పెడతారని, అందరికీ అందుబాటు ధరల్లో కూరగాయలు కూడా అందిస్తారన్నారు. రైతులకు కష్టం వస్తే రైతుల తరపున కోర్టుకు వెళ్లారన్నారు. ఆర్కేను కొనేందుకు చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగలేదన్నారు. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్, చంద్రబాబు పక్కనే నివసిస్తున్నా ఏనాడూ మంగళగిరిలో కాలు పెట్టలేదన్నారు. ఇప్పటికే ఇష్టారాజ్యంగా భూములను లాక్కుంటున్నారని, లోకేష్ గెలిస్తే రైతులకు ఎటువంటి రక్షణ ఉండదన్నారు.

ఆ రెండు పార్టీలూ ఒకటే…

రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఓడిపోతున్నాడని తెలిసి కూడా ప్రతీరోజూ జెర్మనీ రేడియోల్లో ఆయన మంత్రి గోబెల్స్ హిట్లర్ గెలుస్తున్నారని తప్పుడు ప్రచారం చేయించేవారని చెప్పారు. ఇక్కడ కూడా చంద్రబాబు ఓటమి ఖాయమని తెలిసినా ప్రజలను నమ్మించడానికి యెల్లో మీడియా గోబెల్స్ లానే ప్రచారం చేస్తోందని అన్నారు. యెల్లో మీడియా తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలు మరిచిపోరన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వి వేర్వేరు పార్టీలో, ఒకే పార్టీనో ప్రజలు ఆలోచించాలన్నారు. పవన్ పోటీ చేసే భీమవరం, గాజువాకలో చంద్రబాబు, లోకేష్ ప్రచారానికి వెళ్లలేదని, చంద్రబాబు పోటీ చేసే కుప్పం, లోకేష్ పోటీచేస్తున్న మంగళగిరిలో పవన్ ప్రచారం చేయలేదని గుర్తు చేశారు. ఈ రెండు పార్టీలు ఒకటే అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.

Tags:    

Similar News