పవన్ కల్యాణ్ పై జగన్ తీవ్ర విమర్శలు

నాలుగేళ్లుగా చంద్రబాబుతో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ కు బాబు మోసాలు, అవినీతి, దారుణాల్లో వాటా లేదా అని వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. [more]

Update: 2019-03-28 07:58 GMT

నాలుగేళ్లుగా చంద్రబాబుతో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ కు బాబు మోసాలు, అవినీతి, దారుణాల్లో వాటా లేదా అని వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం పాలకొల్లులో జరిగిన ప్రచార సభలో పవన్ కళ్యాణ్ పై జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన పేరు పలకకుండా యాక్టర్, బాబు పార్ట్ నర్ అంటూ పవన్ ను విమర్శించారు. ఐదేళ్లు పరిపాలించిన చంద్రబాబు అవినీతి, అధర్మాలు, మోసాలు, దారుణాల మీద మాట్లాడని పవన్ తనపై విమర్శలు కేవలం తనపైనే విమర్శలు చేస్తున్నాడంటే కుట్ర కాదా అని ప్రశ్నించారు. తన చిన్నాన్నను టీడీపీ వాళ్లే హత్య చేయించి, వాళ్ల పోలీసులతోనే విచారణ చేయించి, కుటుంబసభ్యులపై నిందలు వేస్తుంటే పవన్ కళ్యాణ్ కూడా విలువలు మరిచిపోయి చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారని ఆరోపించారు. తన చిన్నాన్నకు జరిగినట్లే పవన్ కు సంబంధించిన వాళ్లకు జరిగితే ఇలానే మాట్లాడేవారా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News