అందుకే రద్దు చేశాం

ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా? వద్దా? అన్నదే ముందున్న ప్రశ్న అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు సమావేశమయ్యమన్నారు. మన రాష్ట్రంలో తొలగిస్తే కేవలం ఐదు [more]

Update: 2020-01-27 12:06 GMT

ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా? వద్దా? అన్నదే ముందున్న ప్రశ్న అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు సమావేశమయ్యమన్నారు. మన రాష్ట్రంలో తొలగిస్తే కేవలం ఐదు రాష్ట్రాల్లోనే శాసనమండలి వ్యవస్థ ఉందన్నారు. అస్సాం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమకు మండలి వ్యవస్థ వద్దని ఉపసంహరించుకున్నాయని చెప్పారు. శాసనసభలోనే మేధావులు ఉన్నారన్నారు. మండలి చేసిన సవరణలను అసెంబ్లీ పాటించాల్సిన అవసరం లేదన్నారు. మండలి అవసరమే ఉందనకుంటే అన్ని రాష్ట్రాల్లోనూ మండలి ఉందన్నారు. అసెంబ్లీ లో ఆమోదించిన బిల్లులను అడ్డుకోవడానికే శాసనమండలి పనిచేస్తుందన్నారు. ప్రజాప్రయోజనాలను దెబ్బతీయడానికే మండలి ఉందన్నారు. ప్రజాధనాన్ని మండలి కోసం ఖర్చు చేయడం తగదన్నారు. రాజ్యాంగం కూడా మండలి రద్దు అధికారాన్ని అసెంబ్లీకి ఇచ్చిందన్నారు. మండలి చేసిన సవరణలను అసెంబ్లీ ఆమోదించాల్సిన అవసరం లేదన్నారు.

ఎల్లో మీడియా దుష్ప్రచారం….

తాము ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడానికే మూడు రోజుల సమయం తీసుకున్నామని ఎల్లో మీడియా ప్రచారం చేసిందన్నారు. చంద్రబాబు గతంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ఈ ఎల్లోమీడియా పట్టించకోలేదన్నారు. తాను అసెంబ్లీ సమావేశాలను పొడిగించిన రోజునే మండలి రద్దుకే అని స్పష్టంగా చెప్పామన్నారు. ఈ మాత్రం సమయం కూడా ఇవ్వకపోయి ఉంటే ఎవరిని సంప్రదించకుండా జగన్ నిర్ణయం తీసుకున్నారని ఆడిపోసుకునేవని చెప్పారు. ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికీ ఐదు కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ కోణంలో ఉన్న ఇటువంటి సభను కొనసాగించడం అవసరం లేదని జగన్ చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు గతంలో చేసిన ప్రసంగాలను సభలో ప్రదర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ విషయంలోనూ చంద్రబాబు యూటర్న్ లను తీసుకున్న విషయాలను ప్రదర్శించారు.

ఏం అన్యాయం జరిగిందని…?

అమరావతిలో ఏం అన్యాయం జరిగిందని చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారని జగన్ ప్రశ్నంచారు. రైతులకు కౌలు పదిహేనేళ్లకు పెంచామని చెప్పారు. రిటర్న్ బుల్ ప్లాట్లను కూడా ఇవ్వబోతున్నామని చెప్పారు. చంద్రబాబు చేసిన తప్పిదాలను తమ ప్రభుత్వం రిపేర్ చేస్తుందన్నారు. అమరావతిలో శాసన రాజధానిని కొనసాగిస్తున్నామని, తరలించడం లేదని చెప్పారు. అమరావతిలోనే కొనసాగిస్తూనే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తే ఎవరికి అన్యాయం చేసినట్లు అని జగన్ ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అందుకే శాసనమండలిని రద్దు చేస్తున్నామని చెప్పారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు తమకు ఉన్నాయన్నారు.

Tags:    

Similar News