ఆ ముగ్గురిని టార్గెట్ చేసిన జగన్.. చక్రం తిప్పే పనిలో బాబు..!

హస్తినలో ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కాయి. విపక్ష అధినేత జగన్, ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఢిల్లీ కేంద్రంగా రాజకీయ తుఫాన్ మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో 56 లక్షల [more]

Update: 2019-02-04 18:29 GMT

హస్తినలో ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కాయి. విపక్ష అధినేత జగన్, ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఢిల్లీ కేంద్రంగా రాజకీయ తుఫాన్ మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో 56 లక్షల నకిలీ ఓటర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు ముగ్గురు అధికారులను తక్షణం వారి విధుల నుంచి తప్పించే ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ చీఫ్ ఫిర్యాదు చేశారు. ఇక చంద్రబాబు విపక్ష నేతలతో ఈవీఎంల రద్దు ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. ఇలా ఇద్దరు నేతలు తమదైన రీతిలో హస్తినలో రాజకీయాలు హాట్ హాట్ గా మారిస్తే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శ్రీకాకుళం పలాస లో హల్చల్ చేయడం గమనార్హం.

బాబు తన కులానికే పెద్ద పీట …

ఇటీవల ఏపీలో 37 మంది సిఐలను డిఎస్పీలుగా పదోన్నతులు కల్పించారని వీరిలో 35 మంది చంద్రబాబు తన కులస్తులకు ఇచ్చార‌ని వైఎస్ జగన్ ఆరోపించారు. మరో ఇద్దరిలో ఒకరు బాబు కులస్థులను పెళ్లి చేసుకున్న కారణంగా పదోన్నతి ఇచ్చారని వైసీపీ చీఫ్ తన ఫిర్యాదులో పేర్కొనడం చర్చనీయంగా మారింది. ఈ అంశంతో పాటు చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగే ముగ్గురు అధికారులకు ఒకరికి లేని పదవులు కల్పించి మరీ పోస్టింగ్ లు ఇచ్చి వచ్చే ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి టీడీపీ సిద్ధమైందని వారిని తొలగించే ఎన్నికలు నిర్వహించాలని జగన్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి క‌చ్చితంగా ఊహించే ఈవీఎంలను రద్దు చేయాలంటూ బాబు గోల మొదలు పెట్టారని కూడా జగన్ నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈవీఎం ట్యాపరింగ్ లు అయితే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి ఎలా వచ్చిందని కూడా ప్రశ్నించారు జగన్.

 

Tags:    

Similar News