జగన్ పై హత్యాయత్నం చేయడానికి ముందే అతనికి జాక్ పాట్ తగిలిందా...?

Update: 2018-10-27 09:22 GMT

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో జగన్ అభిమాని కాదని, నిందితుడిది టీడీపీ కుటుంబమని, టీడీపీ ఎంపీపీ కోసం వారి కుటుంబం పనిచేసిందని, నిందితుడి బాబాయి టీడీపీ వార్డ్ మెంబర్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రిటైర్డ్ పోలీస్ అధికారి ఇక్బాల్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హత్యాయత్నం ఘటనలో పలు కీలక అంశాలను లేవనెత్తారు.

- ఒక మామూలు వెయిటర్ ఏడాదిలో 9 ఫోన్లు ఉపయోగించి 10 వేల కాల్స్ ఎందుకు మాట్లాడాడో విచారణ జరిగిందా..?

- నిందితుడు కొన్నిరోజుల క్రితం స్వగ్రామానికి వచ్చి తెలిసిన వారికి ఘనంగా విందు ఇచ్చి, జాక్ పాట్ తగిలింది అని, తన జీవితం సెటిల్ అయ్యిందని ఎందుకు చెప్పాడు..?

- జనవరి నుంచి కత్తి పెట్టుకుని ఉన్నాడని కమిషనర్ చెప్పారు. ఆపరేషన్ గరుడ అని శివాజి చెప్పిన సమయానికి, ఈ సమయానికి లింక్ ఉందా..?

- పెయిడ్ ఆర్టిస్ట్ శివాజిని వెంటనే పిలిచి అతడి దగ్గర ఏమేం వివరాలు ఉన్నాయో వెంటనే విచారణ జరపాలి.

- ఈ కుట్రకు వెనుక ఉన్న వారితో నిందితుడు శ్రీనివాసరావుకు ప్రాణహానీ ఉండే అవకాశం ఉంది. వెంటనే అతడికి సరైన రక్షణ కల్పించాలి.

- దాడి జరిగినా జగన్ హుందాగా ప్రవర్తించి ఎయిర్ పోర్టులో ప్రాథమిక చికిత్స చేయించుకుని షర్ట్ మార్చుకుని వచ్చారు. జగన్ స్థానంలో ఎవరైనా టీడీపీ నేత ఉంటే సానుభూతి కోసం అక్కడే పడిపోయి నటించేవారు.

- జగన్ వైజాగ్ ఆసుపత్రిలో చేరి ఉంటే ప్రజలు ఆగ్రహానికి గురై ఆందోళనలు జరిగేవేమో, వెంటనే జగన్ శాంతిభద్రతల సమస్యలు సృష్టించారని టీడీపీ నేతలు నేపం నెట్టేవారు.

Similar News