వైసీపీ ఇక్కడే పుట్టిందన్న జగన్

Update: 2018-07-28 11:55 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పుట్టిన నియోజకవర్గంలో పర్యటించడం తనకు ఆనందంగా ఉందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగ్గంపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎనిమిదేళ్ల క్రితం ఇదే జగ్గంపేటలో తాను పార్టీ ప్రకటించానన్నారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో పాదయాత్ర ప్రవేశించడంతో వందో నియోజకవర్గంలోకి చేరడం జరిగిందన్నారు. అలాగే ఇదే నియోజకవర్గంలో 2600 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిందన్నారు. ఇదే నియోజకవర్గ ప్రజలు 2014 ఎన్నికల్లో వైసీపీకి విజయం సాధించిపెట్టారన్నారు.

ఎమ్మెల్యేకు 25 కోట్లు......

అభివృద్ధికోసమే పార్టీ మారానని చెబుతున్న జగ్గంపేట ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25 కోట్లు ఇచ్చి సంతలో పశువులను కొనుగోలుచేసినట్లు కొన్నారని తీవ్ర ఆరోపణలు చేశారన్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారన్నారు. ఏమాత్రం సంతోషంగా లేరన్నారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లనే ఉందన్నారు. అవినీతి, కమీషన్లతో పాలన సాగుతుందన్నారు. జన్మభూమి కమిటీల దందాలతో ప్రజలు విసుగెత్తి పోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తిరిగి అండగా నిలవాలని జగ్గంపేట ప్రజలను జగన్ కోరారు.

Similar News