జగన్ ధైర్యం చూడూ....!

Update: 2018-07-28 13:08 GMT

కాపు రిజర్వేషన్లపై వైసీపీ అధినేత జగన్ కుండబద్దలు కొట్టేశారు. జగ్గంపేట సభలో ఆయన మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లపై తాను స్పష్టమైన హామీ ఇవ్వలేనన్నారు. ఎందుకంటే అది రాష్ట్ర పరిధిలో లేని అంశమన్నారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని, మరికొన్ని రాష్ట్ర పరిధిలో ఉంటాయన్నారు. యాభై శాతం రిజర్వేషన్లు దాటితే అది కేంద్రం నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. తన పరిధిలో లేని అంశాన్ని తాను హామీ ఇవ్వలేనన్నారు. కాపు కార్పొరేషన్ కు రెట్టింపు నిధులు ఇచ్చి కాపు సోదరులను ఆదుకుంటానని చెప్పారు. తాను ఏదైనా మాట ఇస్తే మాట మీద నిలబడతానని, చేయలేని పనులు చేస్తానని చెప్పలేనన్నారు.

అబద్ధాలు అలవాటు లేదు.....

చంద్రబాబు లాగా తాను అబద్ధాలాడే వాడిని కానన్నారు. కాపు రిజర్వేషన్లపై జగన్ స్పష్టమైన ప్రకటన చేస్తారని అందరూ భావించారు. కాని తన పరిధిలో లేని అంశాన్ని తాను హామీ ఇవ్వలేనని చెప్పడం విశేషం. జగన్ ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. నిర్మొహమాటంగా చెప్పడాన్ని కొందరు స్వాగతిస్తున్నారు. వై.ఎస్. జగన్ ధైర్యంగా, ఓట్ల కోసం కాకుండా ప్రకటన చేయడం కొందరిని ఆకట్టుకుంది. అయితే కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం లాంటి నేతలు ఎలా స్పందిస్తారోచూడాలి.

Similar News