నిందితుడి గురించి గ్రామస్థుల మాట

Update: 2018-10-26 10:14 GMT

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జానేపల్లి శ్రీనివాసరావు గురించి ఆయన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం పరిధిలోని ఠాణేలంక గ్రామస్థులు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. కొందరు గ్రామ వైసీపీ నేతలు, గ్రామస్థులు మీడియాతో మాట్లాడుతూ... జగన్ తో నిందితుడు ఉన్న ఫ్లేక్సీ అసలు గ్రామంలో వేయనే లేదని, ఆ ఫ్లెక్సీని తాము చూడలేదని పేర్కొన్నారు. శ్రీనివాసరావు ఇంతవరకు ఒక్క పార్టీ కార్యక్రమంలో చూడలేదని స్పష్టం చేశారు. శ్రీనివాసరావు కుటుంబానిది మొదటి నుంచి తెలుగుదేశం నేపథ్యమే అన్నారు. ఒకవేళ వైసీపీకి చెందిన వారే అయితే, అతడి కుటుంబానికి ఇళ్లు, లోన్లు ఎందుకు మంజూరు చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. నిందితుడికి నేరచరిత్ర కూడా ఉందని, 2017లో కాగిత వెంకటేష్ అనే వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. స్థానిక టీడీపీ పెద్దల సిఫార్సుతోనే ఎయిర్ పోర్టు రెస్టారెంట్ లో ఉద్యోగం పొందాడని గ్రామ వైసీపీ నేతలు ఆరోపించారు.

Similar News