విజయ్ మాల్యా చిలక పలుకులు విన్నారా..?

Update: 2018-07-31 13:00 GMT

లిక్కర్ ‘కింగ్’ విజయ్ మాల్యాకు లండన్ కోర్టు మళ్లీ ఊరటనిచ్చింది. రుణాల ఎగవేత, మనీ లాండరింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న విజయ్ మాల్యాను భారత్ అప్పగించాలని లండన్ కోర్టులో భారత్ వేసిన పిటీషన్ పై మంగళవారం విచారణ జరిగింది. ఈ విచారణలో తన వాదనలు వినింపించేందుకు కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో కలిసి విజయ్ మాల్యా కోర్టుకు వచ్చాడు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని విజయ్ మాల్యా ఆరోపించాడు. తనకు రూ.14 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని, అవి అమ్మి అప్పులు కట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

అప్పులు తీరుస్తానంటున్నా.....

2015 నుంచే తాను అప్పులు తేర్పేందుకు ప్రయత్నిస్తున్నానని, కానీ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని చెప్పాడు. అయితే, ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 12 వరకు వాయిదా వేస్తూ అప్పటి వరకు విజయ్ మాల్యాకు బెయిల్ పొడిగించారు. రూ.9 వేల కోట్ల రుణాల ఎగవేత, మనీ లాండరింగ్ ఆరోపణలపై గత సంవత్సరం ఏప్రిల్ లో మాల్యా జైలుకు వెళ్లి తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే భారత్ మాల్యాను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నా కోర్టు ఎప్పటికప్పుడు మాల్యాకు ఊరటనిస్తోంది.

Similar News