బ్రేకింగ్ : రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ఎమ్మెల్యే

Update: 2018-07-09 05:58 GMT

తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రకటించారు. రామగుండం కార్పొరేషన్ మేయర్ కు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు పొసగడం లేదు. మేయర్ ను తప్పించాలని సోమారపు గత కొంతకాలంగా అధిష్టానాన్ని కోరుతున్నా పట్టించుకోలేదు. దీంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉప సంహరించుకోవాలని టీఆర్ఎస్ పెద్దలు సోమారపు పై వత్తిడి తెచ్చారు. మేయర్ అవినీతి పరుడని, ఆయనకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వం, అధిష్టానంపై ఆయన మండిపడ్డారు. మనస్థాపం చెందిన రామగుండం ఎమ్మెల్యే సత్యనారాయణ వచ్చే ఎన్నికలలో తాను పోటీచేయబోనని ప్రకటించారు. కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. సోమారపు సత్యనారాయణ ఆర్టీసీ ఛైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే తనకు ఆర్టీసీలో కూడా స్వేచ్ఛను అధిష్టానం కల్పించలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ లో క్రమశిక్షణ లోపించిందన్నారు.

Similar News