రేవంత్ రెడ్డి రెడీ అంట..!

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధిష్ఠానం ఆదేశించినట్లు నడవాలని, గెలిచినా, [more]

Update: 2019-03-13 10:10 GMT

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధిష్ఠానం ఆదేశించినట్లు నడవాలని, గెలిచినా, ఓడినా పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి పోటీ చేస్తానన్నారు. పోరాడాల్సిన బాధ్యత నాయకుడిగా తనపై ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ పార్లమెంటు సీట్లు గెలిచే అవకాశం ఉందని, 2014 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలిచినా మూడు నెలల్లో వచ్చిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ గచ్చిబౌలి దివాకర్ అని… కాంగ్రెస్ పార్టీ టెండుల్కర్ లాంటి పార్టీ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News