తెలుగు తమ్ముళ్లు దిశ మళ్లించారే ...?

Update: 2018-12-18 07:30 GMT

తెలంగాణ లో ఘోరపరాభవం తరువాత తెలుగు తమ్ముళ్లు ఏపీలో తలెత్తుకోలేని పరిస్థితి ఎదురైంది. ఫలితాలు వెలువడ్డాక గులాబీ బాస్ మరింత జోష్ తో కార్యక్రమాలు మొదలు పెట్టారు. చకచకా రాజకీయ వాతావరణం తనకు అనుకూలంగా మార్చుకోవడం మొదలు పెట్టారు. ఇదే ఊపులో పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. అంతేకాదు తన కుమారుడిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీకి ప్రకటించి శ్రేణుల్లో సమరోత్సహం పెంచారు. పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టి పగ్గాలు అప్పగించారు. సుపుత్రుడికి వచ్చే పంచాయితీ ఎన్నికలు, స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల్లో 100శాతం విజయాన్ని టార్గెట్ పెట్టారు.

తుఫాన్ తో దృష్టి మరల్చిన ...

శరవేగంగా మారుతున్న తెలంగాణ రాజకీయాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఓటమి మిగిల్చిన చేదు అనుభవాన్ని మరచిపోవాలంటే తక్షణం ఒక ప్రధాన అంశం రెండు రాష్ట్రాల్లో ప్రచారం కావాలి. అనుకున్నట్లే టిడిపి మీడియా కు తుఫాన్ రూపంలో కొంత ఉపశమనం లభించింది. ఎన్నడూ లేని విధంగా గత నాలుగురోజులుగా తీవ్ర వాయుగుండాన్ని తుఫాన్ గా మార్చి జనం దృష్టిని విజయవంతంగా రాజకీయాలనుంచి మళ్లించారు.

ఏపీ రాజకీయాలను వదిలేలా?

గత రెండు రోజులుగా తెలంగాణ లో కేటిఆర్ వర్కింగ్ ప్రసిడెంట్ ఆ తరువాత బాధ్యతల స్వీకరణ వంటి హడావిడి బాగా ఎక్కువైంది. భాగ్యనగర్ గడ్డపై వున్న రెండు తెలుగు రాష్ట్రాల మీడియా ఎక్కువ సమయం ఆ వార్తలే ముఖ్యంగా ఛానెల్స్ ఇవ్వలిసిన పరిస్థితి. దాంతో తుఫాన్ వారిని కొంత కాపాడింది. అత్యధిక వార్తలు తుఫాన్ చుట్టూ నడిపి జనం దృష్టిని తీరం దాటేలా చేసినా వచ్చే రోజుల్లో టి సర్కార్ ఘన విజయ ప్రభావం మాత్రం దీర్ఘ కాలం ఎపి రాజకీయాలను వదిలేలా మాత్రం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు

Similar News