ఆ ఎంపీలతో మాట్లాడను

Update: 2018-06-28 05:50 GMT

ఒకపక్క తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణ నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన దీక్ష 8వ రోజుకు చేరింది. సీఎం రమేష్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రధాన మంత్రి మోదీ అపాయింట్ మెంట్ కోరారు. అయితే టీడీపీ ఎంపీల అపాయింట్ మెంట్ ను ప్రధాని కార్యాలయం తిరస్కరించింది. ఇతర కార్యక్రమాలు ఉండటంతో ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. నిన్న ఉక్కు గనుల శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ను కలిశారు.

క్షీణిస్తున్న సీఎం రమేష్ ఆరోగ్యం....

అయితే కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ తమకు రాష్ట్రం నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉందని, ఆ సమాచారం వస్తే తుది నిర్ణయం తీసుకుంటామని, స్టీల్ ప్లాంట్ ను మాత్రం ఏర్పాటుచేస్తామని చెప్పారు.కేంద్రమంత్రి కోరిన సమాచారాన్ని తీసుకుని ఈరోజు మళ్లీ ఉక్కు మంత్రిని కలిసేందుకు టీడీపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సీఎం రమేష్ఆరోగ్యం క్షీణిస్తుండటంత గంట గంటకూ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడే మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డిలు ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Similar News